నష్టాల్లోనే సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లలో కొనసాగిన పతన ప్రభావం ఆసియా మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లో భారీ పతనం కన్పిస్తోంది. బాండ్ ఈల్డ్స్ బాగా పెరగడంతో పాటు డాలర్ బలపడటంతో ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి కన్పించింది. నాస్ డాక్ రెండున్నర శాతం నష్టపోగా, మిగిలిన సూచీలు రెండు శాతం నష్టపోయాయి. ఫ్రంట్‌లైన్ గ్రోత్ స్టాక్స్ పతనం కావడంతో సూచీలు భారీగా దెబ్బతిన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అదే ట్రెండ్ కన్పిస్తోంది. అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్, హాంగ్‌సెంగ్ నష్టాలు దాదాపు ఒక శాతం వరకు ఉండగా, చైనా మార్కెట్లు అర శాతం వరకు నష్టపోయాయి. సింగపూర్ నిఫ్టి 70 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది.