వడ్డీ రేటు పెంచిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రైమ్ లెండింగ్ రేటు (PLR)ను అర శాతం పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజా పెంపుతో వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 8 శాతానికి చేరాయి. కొత్త రేట్లు ఆగస్టు 22 నుంచే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం వల్ల తాము ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.