స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17992ని తాకిన నిఫ్టి ఇపుడు 17973 ప్రాంతంలో నిఫ్టి ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 17 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 36 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. క్రూడ్‌పై వైండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గించడంతో ఓఎన్జీసీ, వేదాంత లాభాల్లో ఉన్నాయి. డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకం పెంచడంతో రిలయన్స్ నష్టాల్లో ఉంది. ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నిఫ్టి టాప్ గెయిన్స్‌లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ నిఫ్టి నష్టాల్లో టాప్‌లో ఉంది. కాని నష్టాలు నామ మాత్రమే. ఇక ఇతర సూచీల విషయానికొస్తే నిఫ్టి బ్యాంక్ ఒక్కటే రెడ్‌లో ఉంది. మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ కూడా అదానీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. టీవీఎస్ మోటార్స్ రెండు శాతం పెరిగింది. రైల్వే బుకింగ్ కౌంటర్లు మూసివేస్తున్నారన్న వార్తలతో నిన్న ఐఆర్సీటీసీ షేర్ పెరిగింది. కాని అలాంటి ఉద్దేశం రైల్వేలకు లేదని వార్తలు రావడంతో షేర్ రూ. 10 తగ్గి రూ. 704 వద్ద ట్రేడవుతోంది. డిక్షన్ టెక్నాలజీస్ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది.