NIFTY LEVELS: పడితే కొనండి
నిఫ్టి క్రితం ముగింపు 17,944. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే స్వల్ప ఒత్తిడికి లోను అయ్యే అవకాశముంది. నిఫ్టి ఇప్పటికీ ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా ఇవాళ నిఫ్టిపై ఒత్తిడి వచ్చే అవకాశముంది. అయితే నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి గనుక ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు అందే పక్షంలో నిఫ్టి 18000ని దాటే అవకాశముంది. సో… నిఫ్టికి 17,912 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశముంది.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 18040
రెండో నిరోధం – 18016
తొలి నిరోధం – 18001
నిఫ్టికి కీలకం – 17912
తొలి మద్దతు – 17888
రెండో మద్దతు – 17872
డౌన్ బ్రేకౌట్ – 17849