కోలుకున్న వాల్‌స్ట్రీట్
ఓపెనింగ్‌లో భారీ నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్ కోలుకుంది. నాస్డాక్ నష్టాలు చాలా వరకు తగ్గాయి… ఇపుడు కేవలం 0.08 శాతం అంటే నామమాత్రపు నష్టాల్లో ట్రేడవుతోంది. కార్పొరేట్ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో డౌజోన్స్ 0.7 శాతంపైగా లాభంతో ఉంది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.31 శాతం లాభంతో ఉంది.కరెన్సీ మార్కెట్లో పెద్ద మార్పు లేదు. డాలర్ ఇండెక్స్ 106పైనే ఉంది.అయితే క్రూడ్ ఆయిల్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ మరో రెండు శాతం క్షీణించింది. బులియన్ మార్కెట్ కూడా నిస్తేజంగా ఉంది. అంతకుముందు యూరో మార్కెట్లు చాలా పటిష్ఠంగా ముగిశాయి. ఒకట్రెండు మార్కెట్లు మినహా.. ప్రధాన మార్కెట్లన్నీ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరోస్టాక్స్ 50 సూచీ కూడా 0.41 శాతం లాభంతో ముగిసింది. జర్మనీ డాక్స్ 0.68 శాతం లాభంతో క్లోజైంది. అమెరికా మార్కెట్ మూడ్ చూస్తుంటే నాస్ డాక్ ఏ క్షణమైనా గ్రీన్‌లోకి వచ్చేసేలా ఉంది.