ఆయన చేయి పడితే చాలు…
రాకేష్‌ఝున్‌ఝున్‌వాలా నేటి తరం స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు హీరో. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత స్టాక్ మార్కెట్ మార్కెట్ బూమ్‌తో రాకేస్ ఝున్ ఝున్ వాలా అనూహ్యంగా ఎదిగారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండమని ఇన్వెస్టర్లకు దూరంగా ఉండమని సలహా ఇచ్చచే రాకేష్.. డే ట్రేడింగ్‌కు దూరంగా ఉండేవారు. ముఖ్యంగా యాప్‌టెక్, టైటాన్ షేర్లలో ఆయన దీర్ఘకాలిక ఆలోచన, పెట్టుబడి మార్కెట్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన పెట్టుబడి పెట్టిన పలు పబ్లిక్ ఆఫర్లు, షేర్లు ఫెయిల్ అయినా.. ఆయన విజయాలే ఎక్కువ. అందుకే ఆయన ఎపుడూ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కే మొగ్గు చూపేవారు. దీంతో ఒకప్పుడు నష్టజాతక షేర్లుగా పేరొందిన షేర్లు కూడా రాకేష్ చేయి పడగానే మెరిసిపోయేవి. చాలా మంది ప్రమోటర్లు తమ పబ్లిక్ ఇష్యూలో భాగం కావలని రాకేష్‌ను ఆహ్వానించడంలో అర్థం కూడా అదే. ఇటీవల ఆయన పెట్టుబడి పెట్టిన షేర్లలో మెట్రో బ్రాండ్స్ అనూహ్య ఫలితాలు ఇచ్చింది. ఈ కంపెనీలో పబ్లిక్ ఇష్యూకు ముందే రాకేష్ పెట్టుబడి పెట్టారు. లిస్టింగ్ తరవాత ఒక మోస్తరు లాభాలు ఆర్జించిన ఈ షేర్ జూన్ త్రైమాసిక ఫలితాలు తరవాత దూసుకుపోయింది. రూ. 500-రూ. 550 ప్రాంతంలో ఉన్న కేవలం పది రోజుల్లో ఈ షేర్ రూ. 850ని తాకింది. ఆయన కనకవర్షం కురిపించిన షేర్ మాత్రం టైటాన్. ఆయనకు వాటాలు ప్రధాన కంపెనీలు : టైటాన్ (రూ. 9708 కోట్లు) టాటా మోటార్స్ (రూ. 1715 కోట్లు), ఫెడరల్ బ్యాంక్ (రూ.754.9 కోట్లు), జూబ్లియంట్ ఫుడ్స్ (రూ.374 కోట్లు) క్రిసిల్ (రూ. 1309 కోట్లు) కెనరా బ్యాంక్ (రూ. 772 కోట్లు) స్టార్ హెల్త్ కేర్ (రూ. 5564 కోట్లు) మెట్రో బ్రాండ్స్ (రూ.2263 కోట్లు) ఫోర్టిస్ హెల్త్ కేర్ (రూ.792.8 కోట్లు) ఐహెచ్‌సీఎల్ (రూ. 738 కోట్లు). ఇవి ప్రధాన కంపెనీలు మాత్రమే. ఆయనకు చెందిన రేర్ ఎంటర్‌ప్రైజస్ ఇంకా అనేక కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది.