స్థిరంగా సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మొన్న భారీగా పెరిగిన నాస్డాక్ రాత్రి 0.58 శాతం క్షీణించగా, ఇతర సూచీల్లో పెద్దగా మార్పులు లేవు. దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిశాయి. డాలర్ ఇండెక్స్ 105 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల వద్ద ఉంటోంది. ఇక బులియన్లో పెద్దగా మార్పులు లేవు. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి… జపాన్ నిక్కీ తప్ప. జపాన్ నిక్కీ సెలవు తరవాత ఇవాళ భారీ లాభాలతో ట్రేడవుతోంది. నిక్కీ 225 సూచీ రికార్డు స్థాయిలో రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. చైనా సూచీల్లో పెద్ద మార్పు లేదు. హాంగ్‌సెంగ్ 0.3 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. చూస్తుంటే నిఫ్టి స్థిరంగా లేదా.. స్వల్ప లాభాలతో ప్రారంభం కావొచ్చు. అయితే లాభాల స్వీకరణ వస్తుందేమో చూడాలి.