శాంసంగ్ ఫ్లిప్ ఫోన్స్ సంచలనం
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో శాంసంగ్ సంచలనం సృష్టించింది. ఈ కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన ఫ్లిప్ మోడల్ ఫోన్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మడత పెట్టగల ఈ ఫోన్ ఫీచర్స్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మోడల్స్‌కు వస్తున్న స్పందన చూసి 2025కల్లా తమ ఫోన్లలో సగం ఫోన్లు ఫ్లిప్ ఫోన్లే ఉంటాయని శాంసంగ్ అంటోంది. Galaxy Z Flip 4, Galaxy Z Fold 4 ఫోన్లతో ఈ మార్కెట్లో తమ స్థానం పదిలం కానుందని కంపెనీ అధ్యక్షుడు రో తై మూన్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మాంద్యం ఉన్నా.. ఈసారి తమ అమ్మకాలు భారీగా ఉంటాయనే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అనేక కొత్త ఆప్షన్స్ ఉన్న ఫ్లిప్ ఫోన్స్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో కూడా ఫోల్డబుల్ ఫోన్ష్ వచ్చినా.. తమ తాజా మోడల్స్ అటు హార్డ్‌వేర్ విషయంలోనూ ఇటు సాఫ్ట్వేర్ విషయంలో చాలా మెరుగైన సౌకర్యాలతో వచ్చినట్లు ఆయన చెప్పారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ పేరెంట్ మెటా కంపెనీల సాయంతో తాము ఈసారి అద్భుత ఫీచర్స్‌తో ఫ్లిప్ ఫోన్స్ తెచ్చినట్లు రో తెలిపారు.Galaxy Z Flip 4 ఫోన్ దాదాపు పీసీలాగా పనిచేస్తుందని అన్నారు. గూగుల్ సాయంతో డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ తెచ్చామని.. దీనివల్ల గూగుల్ అప్లికేషన్స్‌ను చాలా సులువుగా వాడొచ్చని అన్నారు. ఫోటోలు, ఫైల్స్ షేరింగ్, కాపీ, పేస్ట్ లింక్స్చాలా సౌకర్య వంతంగా ఉన్నాయని చెప్పారు.