టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత
విమాన టికెట్ చార్జీలపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దేశీయ మార్గాల్లో నడిచే సర్వీసులకు వర్తిస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలు తమ ఇష్టానుసారం టికెట్ ధరలను నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. విమాన ఇంధన ధరలు, రోజువారీ ప్రయాణికుల డిమాండ్ వంటి అంశాలను విశ్లేషించిన అనంతరం విమాన ఛార్జీలపై పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు మంత్రి సింధియా తెలిపారు. కొవిడ్ కారణంగా రెండు నెలలు లాక్డౌన్ తర్వాత 2020 మే నెలలో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు.. దేశీయ మార్గాల్లో ఛార్జీలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్రం విధించింది.