స్థిరంగా ముగిసిన నిఫ్టి
నిఫ్టి ఇవాళంతా స్థిరంగా కొనసాగింది. ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనైనా వెంటనే కోలుకుని చాలా వరకు 17500పైన కొనసాగింది. యూరో మార్కెట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్లో ఉన్నందున నిఫ్టి 17534 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 9 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ మాత్రం 35 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టిలో 30 షేర్లు గ్రీన్లో ఉండగా, 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ గ్రీన్లో ముగియగా, నిఫ్టి నెక్ట్స్ 0.35 శాతం నష్టంతో క్లోజైంది. నిఫ్టి మిడ్ క్యాప్ 0.17 శాతం నష్టపోయింది. ఇవాళ హిందాల్కో, కోల్ ఇండియా, యూపీఎల్ షేర్లు నిఫ్టిని గ్రీన్లో ఉంచడానికి ప్రయత్నించాయి. టాటా స్టీల్ కూడా రెండు శాతం లాభపడింది. అయితే బజాజ్ ఫైనాన్స్ రెండున్నర శాతంపైగా నష్టపోయింది. ఇక హైదరాబాద్కు చెందిన షేర్లలో దివీస్ ల్యాబ్ రూ.11 లాభపడగా, రెయిన్బో హాస్పిటల్ షేర్ రూ.59.35 లాభంతో రూ. 533 వద్ద ముగిసింది. అయితే నాట్కో ఫార్మా పది శాతంపైగా నష్టపోయి రూ. 672.85 వద్ద ముగిసింది. ఈ షేర్ ఇవాళ ఉదయం రూ. 773.90ని తాకింది.ఈ లెక్కన చూస్తే ఈ ఒక్క రోజే నాట్కో షేర్ రూ.100 క్షీణించిందన్నమాట.