నికర లాభం రూ. 38.76 కోట్లు
జూన్ త్రైమాసికంలో రెయిన్బో హాస్పిటల్స్ ( రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్) రూ .237.15 కోట్ల ఆదాయంపై రూ .38.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ .246.35 కోట్ల ఆదాయంపై రూ .35.88 కోట్ల నికరలాభం ప్రకటించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.212.44 కోట్లు కాగా నికరలాభం రూ.12.26 కోట్లు. కాబట్టి గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ పనితీరు బాగా మెరుగుపడినట్లే. ఈ త్రైమాసికంలో వైద్య పడకల ఆక్యుపెన్సీ 43.08 శాతానికి పెరిగిందని, ఇన్ అవుట్ పేషెంట్ల సంఖ్య కొవిడ్ ముందు స్థాయికి చేరుకున్నట్లు కంపెనీ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల వివరించారు. ఇదే తరహా వృద్ధి మున్ముందు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నైలో కొత్త ఆసుపత్రిని ప్రస్తుత త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.