నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
ప్రపంచ మార్కెట్లు డైలమాలో ఉన్నాయి. అమెరికాలో జాబ్ డేటా చాలా పాజిటివ్‌గా రావడంతో… మళ్ళీ వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్లు అంచనా వేయడం ప్రారంభించాయి. దీంతో గత శుక్రవారం అమెరికా మార్కెట్లు అనిశ్చితిలో ముగిశాయి. డౌజోన్స్ గ్రీన్‌లో క్లోజ్ కాగా, నాస్డాక్ అర శాతం నష్టంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీలో పెద్ద మార్పు లేదు. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌లో కూడా పెద్ద మార్పు లేదు. స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్ల మాదిరిగానే ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాలు ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక మిగిలిన సూచీలు నష్టాల్లో ఉన్న నష్టాలు ఒక మోస్తరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కానుంది.