అమరరాజా నికర లాభం రూ.132 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్ రూ.132 కోట్ల ఏకీకృత నికర లాభం ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.124 కోట్లతో పోలిస్తే స్వల్పంగా ఆరు శాతమే పెరిగింది. ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1,886 కోట్ల నుంచి రూ.2,620 కోట్లకు అంటే 39 పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆటోమోటివ్ బ్యాటరీల విభాగంలో రీప్లేస్మెంట్ మార్కెట్ విభాగంలో గిరాకీ బాగుందని కంపెనీ అంటోంది. నాలుగు, ద్విచక్ర వాహన కంపెనీల నుంచి కూడా డిమాండ్ ఆశావహంగా ఉందని అమరరాజా బ్యాటరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. ఇంధనం, ఇతర ముడి పదార్థాల ధరల పెరుగుదల ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ బ్యాటరీస్ విభాగంలో మార్జిన్లపై ఒత్తిడి పెంచాయని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్థన గౌరినేని తెలిపారు. లిథియమ్ సెల్ టెక్నాజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.