‘ఆకాశ ఎయిర్’ విమాన సేవలు ప్రారంభం
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నెలకొల్పిన ఆకాశ ఎయిర్ (Akasa Air) సేవలు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఇవాళ జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. ముంబయి నుంచి బయలుదేరిన తొలి విమానం అహ్మదాబాద్‌కు చేరుకోనుంది. భారత్‌లో ప్రభుత్వ అనుమతులు రావాలంటే చాలా జాప్యం జరుగుతుందన్న అపోహ ఉండేదని, మా విషయంలో పౌరవిమానయాన శాఖ మాకు అందించిన సహకారం అద్భుతమని రాకేష్ ఝున్‌ఝన్‌వాలా అన్నారు. ఆకాశ ఎయిర్ నుంచి ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు 19న బెంగళూరు-ముంబయి, సెప్టెంబరు 15న చెన్నై-ముంబయి మధ్య సేవలు ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.