For Money

Business News

15,850పైన నిఫ్టి…కొత్త రికార్డు?

ఉదయం ఊహించినట్లే నిఫ్టి తన తొలి ప్రధాన నిరోధక స్థాయిని దాటి రెండో నిరోధస్థాయిని తాకింది. నిఫ్టి 15,840 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత 15,862కి చేరి ఇపుడు 15,847వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇపుడు 100 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. దీర్ఘకాలిక సూచీలు బ్రేకౌట్‌ను సూచిస్తున్నాయి. స్వల్ప కాలీన నిఫ్టికి ప్రధాన ప్రతిఘటన 15,863.. దిగవస్థాయిలో కొనేవారు ఈ స్థాయిని దాటుతుందేమో చూడండి. ఎందుకంటే నిఫ్టి ఈ స్థాయిని దాటితే 15,906 వరకు ఎలాంటి ప్రతిఘటన లేదు. 15800 ప్రాంతంలో కొని 15900 వరకు వెయిట్‌ చేయడమా లేదా అధిక స్థాయిలో అమ్మడమే అనేది డే ట్రేడర్‌ రిస్క్‌ను బట్టి ఉంటుంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అదానీ పోర్ట్స్‌ 753.80 3.11
మారుతీ 7,073.00 2.51
యూపీఎల్‌ 790.35 2.35
ఓఎన్‌జీసీ 123.45 2.07
టాటా మోటార్స్‌ 341.00 2.00

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సిప్లా 954.60 -0.58
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 715.55 -0.45
నెస్లే ఇండియా 17,581.75 -0.38
హిందుస్థాన్‌ లీవర్‌ 2,507.00 -0.29
బ్రిటానియా 3,643.00 -0.16