For Money

Business News

అరబిందో … మళ్ళీ బ్యాడ్‌ న్యూస్‌

అరబిందో ఫార్మాకు అమెరికా ఎఫ్‌డీఏ కష్టాలు ఇంకా తొలగినట్లు లేదు. అమెరికాలో ఓ ప్లాంట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ప్లాంట్‌ను ఏకంగా మూసేసింది కంపెనీ. తాజాగా కంపెనీకి ఉన్న యూనిట్‌ 11పై ఎఫ్‌డీఏ ఇదివరకే వార్నింగ్‌ లెటర్‌ ఇచ్చింది. యాంటి బయోటిక్స్‌ తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ యూనిట్‌ ఉత్పత్తిలో, నాణ్యపరంగా అనేక లొసుగులు ఉన్నట్లు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. సదరు లొసుగులను సరిచేసినట్లు కంపెనీ ఎఫ్‌డీఏకు లేఖ రాసింది. దీంతో ఎఫ్‌డీఏ బృందం మళ్ళీ ఇన్‌స్పెక్షన్‌కు వచ్చింది. జులై 25 నుంచి ఆగస్టు 2 మధ్య వరకు అంటే నిన్నటి వరకు యూనిట్‌ను సందర్శించి… తయారీ, నాణ్యతకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. రెండోసారి పరిశీలన తరవాత కూడా మూడు అంశాల విషయంలో ఇంకా లోపాలు ఉన్నట్లు ఎఫ్‌డీఏ బృందం అభిప్రాయపడింది. దీంతో అరబింద్ ఫార్మాకు మళ్ళీ ఫామ్‌ 483ని జారీ చేసింది ఎఫ్‌డీఏ. అంటే మళ్ళీ ఆ లోపాలు సరిచేసే వరకు ఈ యూనిట్‌లో తయారు చేసిన మందులను అమెరికాలో అనుమతించరన్నమాట.