ఆర్థిక మాంద్యం వచ్చే ప్రసక్తే లేదు
మనదేశంలో మాంద్యం వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ధరల పెరుగుదలపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మన వృద్ధి నెమ్మదించే ప్రసక్తేలేదని, ధరలు అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె అన్నారు. యూపీఏ హయాంలోనే రెండంకెల స్థాయిలో వృద్ధి రేటు ఉందని ఆమె స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 7శాతం కన్నా దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మన ఆర్థిక వ్యవస్థ ఒకటని ఆమె అన్నారు. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయన్నారు. కరోనా మహమ్మారి తొలి వేవ్, రెండోవేవ్, ఒమిక్రాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో లాక్డౌన్.. వంటి పలు ప్రతికూల పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణాన్ని ఏడు శాతానికి దిగువనే ఉంచగలిగాం. నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు.