ఈ నిఫ్టి స్ట్రాటజీని చూడండి
నిఫ్టి గత వారం 17100 ప్రాంతంలో ముగిసింది. జులై నెలలో 7 శాతం పెరగ్గా, కనిష్ఠ స్థాయి నుంచి 13 శాతం పెరిగింది.నిఫ్టి కాల్స్ అమ్మినవారు గతవారం అడ్డంగా బుక్కయ్యారు. దీంతో చాలా మంది తమ పొజిషన్స్‌ను షార్ట్ చేసుకున్నారు. మరికొందరు తమ పొజిషన్స్‌ను 17500కు మార్చారు. నిఫ్టిలో రోల్ ఓవర్స్ మునుపెన్నడూ లేనంత తక్కువగా అయ్యాయి. దీనికి కారణం..చాలా మంది షార్ట్ కవరింగ్ చేసుకోవడమే. అయితే వచ్చే వారం కూడా నిఫ్టి పెరిగే ఛాన్స్ ఉంది. అయితే కన్సాలిడేషన్‌కు ఛాన్స్ కూడా ఉంది. నిఫ్టి ఒకవేళ క్షీణించే పక్షంలో16800 వద్ద గట్టి మద్దతు లభిస్తుంది. కాబట్టి ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన అనలిస్ట్ రాజ్ దీపక్ సింగ్ ఇన్వెస్టర్లకు ఓ మంచి స్ట్రాటజీ ఇస్తున్నారు.
అదేమిటంటే…
4 ఆగస్ట్ 2022 అంటే నిఫ్టి వీక్లీ అన్నమాట. 17000 పుట్‌ను రూ.59 వద్ద అమ్మడం, ఇదే సమయంలో 16700 పుట్‌ను రూ.16 వద్ద కొనుగోలు చేయడం. అంటే నికర పెట్టుబడి మొత్తం రూ. 43 అవుతుంది (రూ.59 మైనస్ రూ. 16). స్టాప్‌లాస్ రూ.64.5. నిఫ్టి గనుక గురువారం నాటికి 17000పైన ముగిసే పక్షంలో గరిష్ఠ లాభం వస్తుంది. ఒక వేళ వ్యూహం ఫలించకపోతే మీ పెట్టుబడి రూ.43 (పుట్ కొనుగోలు, అమ్మకం వ్యత్యాసం) కాగా …ఈ వ్యత్యాసం రూ.64.5 దాకా ఆగండి. ఈ స్థాయిని దాటితే రెండు పొజిషన్స్‌ను అమ్మేసి స్వల్ప నష్టంతో బయటపడండి.