For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌లోకి వైఎస్‌ ఫ్యామిలీ

విశాఖపట్నం ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వైఎస్‌ కుటుంబం ప్రకటించింది. విశాఖలో రాజధాని కార్యాలయాలు వస్తాయని ప్రకటించిన భీమిలి మండలం కాపులుప్పాడలో వైఎస్‌ ఫ్యామిలీ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. సంబంధించిన వివరాలను విశాఖలో కంపెనీ యజమానులు నిన్న మీడియాకు వివరించారు. దీని కోసం ఆగ్‌మెంట్‌ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు. విశాఖలో అతి పెద్ద విల్లా ప్రాజెక్టు చేపడుతున్నట్టు… భాగస్వాముల్లో ఒకరైన వైఎస్‌ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. ఈయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి చివరి తమ్ముడు, సీఎం జగన్‌కు బాబాయి. ఈ ఎల్‌ఎల్‌పీలో వైఎస్‌ రాగ్‌దీప్‌రెడ్డి, సుమధుర్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ‘‘మాకు గత 38 ఏళ్లుగా పరిచయం ఉన్న విజయ్‌ మిట్టల్‌ అనే వ్యక్తికి కాపులుప్పాడలో 30 ఎకరాల స్థలం ఉంది. అందులోని 11 ఎకరాల్లో తొలి ప్రాజెక్టుగా ‘విల్లాసం’ పేరుతో విల్లాల నిర్మాణం చేపడుతున్నామని… కేవలం 62 విల్లాలు మాత్రమే నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. దీన్ని ఏప్రిల్‌ 2024 నాటికి పూర్తిచేస్తామని… ఒక్కొక్కటి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఉంటుందని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.