For Money

Business News

వెండి రూ.2100 జంప్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. డాలర్‌ తగ్గడంతో పాటు.. 0.75 శాతం మేర వడ్డీ రేట్లను అమెరికా పెంచడంతో బులియన్‌ మార్కెట్‌లో ముఖ్యంగా వెండిలో భారీ ర్యాలీ వచ్చింది. వెండి ధర 7 శాతం పైగా పెరగ్గా, బంగారం ధర 2 శాతం వరకు పెరిగింది. దీంతో మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బులియన్‌ ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూచర్‌ మార్కెట్‌లో కిలో వెండి సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.2124 పెరిగి రూ. 56968కు చేరింది. అలాగే పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర కూడా రూ. 543 పెరిగి రూ.51,263కు చేరింది. ఇది ఆగస్టు కాంట్రాక్ట్‌ ధర.