బాలీవుడ్‌కు సౌత్ నుంచి మరో లైఫ్
బాలీవుడ్ అతి పెద్ద బ్యానర్ ఏదైనా ఉందంటే యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ బ్యానర్ వరుస సూపర్ హిట్స్ కేరాఫ్ అడ్రస్. కాని వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు. అక్షయ కుమార్ పృథ్విరాజ్ కాని, రణబీర్ కపూర్ ‘షంషేరా’ కాని ఆ బ్యానర్ పరువు నిలబెట్టలేకపోయాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ సంగతి అటుంచి అట్టర్ ఫ్లాప్స్‌లో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఇక యష్‌రాజ్ ఫిలిమ్స్‌కు ప్రాణం పోయాల్సిందే పఠాన్, టైగర్ 3 మూవీలే. ఇతర బ్యానర్లదీ ఇదే పరిస్థితి. ఒకటి అరా చిన్న చిన్న సినిమాలు కాస్త కలెక్షన్స్ కాస్త హడావుడి చేయడం వినా… బాలీవుడ్ రేంజ్ వచ్చి కొన్ని నెలలు దాటింది. ఇపుడు స్టూడియోల సంగతి అలా ఉంటే.. ఎగ్జిబిటర్ల పరిస్థితి మరీ దారుణం. పీవీఎస్, ఐనాక్స వంటి కంపెనీలు కూడా తమ మల్టిప్లెక్స్‌లో సినీ స్క్రీన్స్‌ను ఏం చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు. పుష్పతో మొదటి విక్రమ్ వరకు సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించిన ఘనత సౌత్ మూవీలదే. విక్రమ్ పాన్ ఇండియాకు రికార్డు కలెక్షన్ష్ సాధించిన నేపథ్యం ‘విక్రాంత్ రోణ’ కూడా పూర్తి భిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం నుంచి వస్తున్న పబ్లిక్ టాక్ చూస్తుంటే మరో మెగా హిట్ మూవీ వచ్చినట్లే అనిపిస్తోంది. అనేక సెంటర్లలో ఎగ్జిబిటర్లు ఈ మూవీ హిట్‌తో ఊపిరి పీల్చుకుంటున్నారు. వరుసగా హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో… ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు వస్తారా? లేదా? అని ఎగ్జిబిటర్లకు మదనపడుతున్న సమయంలో విక్రాంత్ రోణ వారిలో ఆశలు నింపింది. ఈ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్, జీ మూవీస్ విడుదల చేయడం విశేషం.