మారుతి లాభం రూ.1,036 కోట్లు
జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో మారుతి సుజుకీ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.475 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా రెండింతలు వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.17,776 కోట్ల నుంచి రూ.26,512 కోట్లకు పెరిగింది. కాగా స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.25,286 కోట్ల ఆదాయంపై రూ.1,013 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాదిలో కాలంలో వెహికల్స్ అమ్మకాలు 3,53,614 నుంచి 4,67,931కి పెరిగింది. వీటిలో69437 వాహనాలను ఎగుమతి చేసింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఈ స్థాయిలో వాహనాలను ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ముఖ్యంగా సెమికండక్టర్ చిప్ కొరత కారణంగా 51,000 వాహనాలు తయారు చేయలేకపోయామని మారుతీ తెలిపింది. 2,80,000 కార్లకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.