For Money

Business News

నికర లాభంలో 72% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో కెనరా బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ కాలానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 72 శాతం వృద్ధి చెంది రూ.2,022 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,177 కోట్లు. జూన్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం మాత్రం 10.15 శాతం వృద్ధితో రూ.6,785 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 24.55 శాతం పెరుగుదలతో రూ.5,175 కోట్లకు చేరుకుందని బ్యాంక్‌ వెల్లడించింది. నికర వడ్డీ మార్జిన్‌ (NIM) 2.71 శాతం నుంచి 2.78 శాతానికి చేరింది. స్థూల మొండి బకాయులు (ఎన్‌పీఏ) 8.5 శాతం నుంచి 6.98 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 3.46 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గాయి.