కొటక్ బ్యాంక్ ఫలితాలు ఓకే
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ .2,071.15 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. అదే ఏకీకృత నికర లాభం 53 శాతం వృద్ధితో రూ .2.755 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ .8,062.81 కోట్ల నుంచి రూ .8,582.25 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.6,479.78 కోట్ల నుంచి రూ .7.338.49 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ .3,942 కోట్ల నుంచి 19 శాతం పెరిగి రూ .4,697 కోట్లకు చేరింది . నికర వడ్డీ మార్జిన్ (ఎస్ఐఎం) 4.92 శాతంగా నమోదు కావడం విశేషం. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 3.56 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గడంతో పాటు నికర ఎన్పీఏలు 1.28 శాతం నుంచి 0.62 శాతానికి క్షీణించాయి. బ్యాంక్ రుణాలు 29 శాతం పెరిగి రూ .2,80,171 కోట్లకు చేరాయి.