రూ.1800కోట్లతో ‘బయోలాజికల్ ఈ’ విస్తరణ
ప్రముఖ ఫార్మా కంపెనీ ‘బయోలాజికల్ ఈ’ జీనోమ్ వ్యాలీలో రూ. 1800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో ఇవాళ జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. దీంతో 2,500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్న కేటీఆర్ అన్నారు. బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.