కీలక స్థాయి ఔట్
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారంలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. డాలర్‌పై రాత్రి పెద్దగా ఒత్తిడిగా లేదు. దాదాపు స్థిరంగా 107 వద్ద ముగిసింది. అలాగే అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఔన్స్ బంగారం ధర 1700 డాలర్ల పైనే ఉంది. కాని ఉదయం ఆసియా మార్కెట్లు ప్రారంభం కాగానే బంగారం అత్యంత కీలక స్థాయి అయిన 1700ని కోల్పోయింది. అర శాతంగా పైగా నష్టంతో ఇపుడు 1689 డాలర్ల వద్ద నష్టపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి నష్టపోతున్నందున మన మార్కెట్లో బంగారంలో పెద్ద మార్పు లేదు. అయితే కీలక మద్దతు స్థాయి కోల్పోవడంతో మన మార్కెట్లలో కూడా బంగారంపై ఒత్తిడి రావొచ్చు. ఫార్వర్డ్ మార్కెట్లో నిన్న రాత్రి ఆగస్టు కాంట్రాక్ట్ రూ. 50193 వద్ద ముగిసింది. నిన్న కనిష్ఠ స్థాయి రూ. 50191. ఇవాళ ఓపెనింగ్‌లోనే బంగారం ధర రూ. 50,000 దిగువకు క్షీణించే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ఒక శాతంపైగా క్షీణించి 18.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో రాత్రి వెండి ఆగస్టు కాంట్రాక్ట్ రూ. 55,573 వద్ద ముగిసింది. మరి ఇవాళ వెండి కూడా రూ. 55000 దిగువకు వస్తుందేమో చూడాలి. చాలా వరకు డాలర్- రూపాయి మారకం బట్టి పతనం ఆధారపడి ఉంటుంది.