ఒకే రోజు 53 ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిన్న ఒక్కరోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకొంది. వీటి ద్వారా 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య, విజ్ఞాన సంస్థ ( తెలంగాణ ఆకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ – టాస్క్), పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి. 26 కొత్త సంస్థలతో ఒప్పందాలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణకు సంబంధించిన ఒప్పందాలపై టాస్క్ సీఈవో సిన్హా , ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఎల్అండ్ మెట్రో రైల్, భారత్ ఫోర్జ్, కల్యాణి రాఫెల్ 24/7, హెటిరో, హైసియా, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్, వాహన్, విడాల్, రుబికాన్, హెడ్ హెల్త్ హైలు కూడా ఉన్నాయి. టాస్క్‌ను హైదరాబాద్ వరకే కాకుండా ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్‌లకు విస్తరించామని కేటీఆర్ అన్నారు..