నికరలాభం 21 శాతం డౌన్
2022-23 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో విప్రో కంపెనీ కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం తగ్గి , 2,564 కోట్లకు చేరింది. ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు పెరగడం వల్లే నికర లాభం తగ్గినట్లు వివరించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ 3,243 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. కంపెనీ టర్నోవర్ మాత్రం 18 శాతం పెరిగి 21,529 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 18,048 కోట్లు. ఈ త్రైమాసికంలో ఖర్చులు 22.9 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. వచ్చే సెప్టెంబర్ త్రైమాసికంలో 3 నుంచి 5 శాతం వృద్ధితో ఆదాయం 28.17 కోట్ల డాలర్ల నుంచి 28.72 కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది.
కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోందని, ప్రస్తుతం ఆర్డర్ బుక్ 32 శాతం వృద్ధి చెందుతోందని కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ తైరీ డెలాఫోర్ట్ తెలిపారు. కంపెనీ 15 శాతం ఆపరేటింగ్ మార్జిన్ సాధించినట్లు విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జితిన్ దలాల్ తెలిపారు.