ఈక్విటీ మార్కెట్ల దూకుడు
కంపెనీల ఆర్థిక ఫలితాలు కాస్త సానుకూలంగా ఉండటంతో పాటు డాలర్ బలహీనపడటంతో ఈక్విటీ మార్కెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ కూడా 1.8 శాతం లాభంతో ఉంది. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో ఐబీఎం షేర్ 7 శాతం క్షీణించింది. అయితే ఇతర ఐటీ కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఉద్యోగుల రిక్రూట్మెంట్ విషయంలో యాపిల్ దూకుడు తగ్గిస్తుందన్న వార్తలతో ఆ కంపెనీ షేర్ పెరిగింది. ప్రధాన ఐటీ, టెక్ షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ దాదాపు 0.7 శాతం తగ్గింది. క్రూడ్ ఇవాళ కూడా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 107 డాలర్లకు చేరింది. డాలర్ ఇంతగా క్షీణించినా బంగారంలో ఎలాంటి కొనుగోళ్ళ మద్దతు లేకపోవడం, ధర పెరగకపోవడం విశేషం.