For Money

Business News

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాల వద్ద కొత్త అస్త్రాలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్నివీర్‌ పద్ధతిని రద్దు చేయాలని విపక్షాలు చాలా గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయి. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ సంస్థల దుర్వినియోగం గురించి… అధిక ధరలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమౌతున్నాయి. మరోవైపు ప్రభుత్వ అజెండాలో ఈసారి 32 బిల్లులు ఉన్నాయి. వీటిలో 14 బిల్లులు సభలో ప్రవేశ పెట్టి… చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటిలో కొన్ని స్థాయీ సంఘాలు క్లియర్‌ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని పదాలు సభలో వాడకూడదంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయంనుంది.