రేపటి నుంచి వీటి ధరలు పెరుగుతాయి…
రేపటి నుంచి అంటే ఈనెల 18 నుంచి పలు రకాల ఉత్పత్తులు, సేవల ధరలు మరింత పెరగనున్నాయి. గత నెలలో చండీగఢ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ పలు ఎన్నో గృహ వినియోగ వస్తువులు, హోటళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకింగ్ సేవలతో పాటు పలు వస్తువులు, సేవలపై పన్ను రేట్లను సవరించిన విషయం తెలిసిందే. వీటిలో చాలా రేట్లను తక్కువ స్లాబ్ నుంచి ఎక్కువ స్లాబ్‌కు పెంచారు. రేపటి నుంచి వీటి పన్ను పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) వీటిని నోటీఫై చేసింది.
వాటి వివరాలు…
-ప్రింటింగ్/రైటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్, లెడ్ బల్పులు, లైట్లు, ఫిక్చర్లు, వాటి మెటల్ ప్రింటెడ్ సర్కూట్ బోర్డ్‌ల జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు
-లెదర్ ఉత్పత్తులు, పాదరక్షల తయారీకి సంబంధించిన జాబ్ వర్క్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పెరుగుదల
-సోలార్ వాటర్ హీటర్లు, సిస్టమ్స్‌పై 5 నుంచి 12 శాతానికి పెంపు
-కటింగ్ బ్లేడ్స్‌తో కూడిన నైవ్స్, పేపర్ నైవ్స్, పెన్సిల్ షార్పనర్లు, బ్లేడ్స్, స్పూన్స్, ఫోర్క్స్, స్కిమ్మర్లు, కేక్ సర్వర్స్‌పై 18 శాతం జీఎస్టీ.
-ఎల్ఈడీ లైట్ల, ప్రింటింగ్, డ్రాయింగ్ ఇంక్‌లపై 18శాతం
-సైకిల్ పంప్‌లు, డెయిరీ మెషినరీ, టెట్రా ప్యాక్‌లు
-సోలార్ హీటర్ సిస్టమ్స్, చెప్పులు, తోలు ఉత్పత్తులతో చేసే జాబ్ వర్క్‌లు, ప్రింటెంట్ మ్యాప్‌లు
-సబ్మెర్సిబుల్ పంప్స్‌పై 18 శాతానికి పెంపు
-విత్తనాలు, పప్పు దినుసుల శుద్దికి, గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్లపై జీఎస్టీ 18 శాతం.
-గ్రుడ్లు, పండ్లు, ఇతర వ్యవసాయోత్పత్తుల శుద్దికి, గ్రేడ్ చేయడానికి వాడే యంత్రాలు, వాటి విడిభాగాలు, డెయిరీ పరిశ్రమలో ఉపయోగించే యంత్రాలపై 18 శాతం జీఎస్టీ
-బ్యాంక్ చెక్కులు..లూజ్ లేదా బుక్‌పై 18 శాతం పన్ను
-మ్యాప్‌లు, అట్లాస్‌లు, గ్లోబ్స్పై 12 శాతం పన్ను
-రూ.1,000 వరకూ ఖరీదున్న హోటల్ రూమ్‌పై 12 శాతం జీఎస్టీ
-రోజుకు రూ. 5,000 మించి హాస్పిటల్ వసూలు చేసే రూమ్ అద్దెపై 5 శాతం పన్ను
-రోడ్లు, వంతనెలు, రైల్వేలు, వ్యర్థాల శుద్ది ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్ట్ పనులపై 18 శాతం
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు చెందిన నిర్మాణాల వర్క్ కాంట్రాక్ట్‌లు, సబ్ కాంట్రాక్ట్‌లపై 18 శాతం పన్ను