For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

ఈనెలాఖరులో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఏ మేరకు వడ్డీ రేటు పెంచుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మొన్నటి దాకా ఒక శాతం అని.. ఇపుడు 0.75 శాతం పెంచుతుందని వార్తలు వస్తున్నాయి. వడ్డీ రేట్లను డిస్కౌంట్‌ చేస్తూ పడుతూ వచ్చిన వాల్‌స్ట్రీట్‌ ఇవాళ అనూహ్యంగా భారీ లాభాలతో ట్రేడవుతోంది. అంతకుమునుపు యూరో మార్కెట్లు రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. యూరోస్టాక్స్ 50 సూచీ 2.37 శాతం లాభంతో ముగిసింది. ఇక అమెరికా మార్కెట్లలో డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ స్వల్పంగా తగ్గాయి. అయితే క్రూడ్‌ 2.5 శాతం పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్లీ 101 డాలర్లను దాటింది. ఈనేపథ్యంలో నాస్‌డాక్‌ 1.34 శాతం, ఎస్‌ అండ్ పీ 50 సూచీ 1.57శాతం ఇటీవల బాగా క్షీణించిన డౌజోన్స్ 1.9 శాతం చొప్పున పెరిగాయి.