వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
ఎస్బీఐ మళ్ళీ వడ్డీ రేట్లను పెంచింది. ఎంసీఎల్ఆర్ (Marginal Cost of Lending Rate-MCLR)ను 0.10 శాతం పెంచుతున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లుపెరుగుతాయి. పెంచిన రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. తాజా పెంపెఉతో ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగింది.దీంతో సాధారణ ఇంటిరుణం తీసుకున్నవారికి క్రెడిట్ స్కోరు బట్టి మారుతుంది. 800 పాయింట్లకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి ఇక నుంచి రుణంపై కనీస వడ్డీరేటు 7.55 శాతం ఉంటుంది. రెండేళ్ళకు ఎంసీఎల్ఆర్ 7.7 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి క్రమంగా ఈ వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచుతూ వస్తోంది. ఇంతకుమునుపు జూన్ 15న ఎంసీఎల్ఆర్ను ఎస్బీఐ 0.2 శాతం చొప్పున పెంచింది.