For Money

Business News

స్థిరంగా SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఒడుదుడుకుల తరవాత మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.9 శాతంపైగా నష్టంతో ముగిశాయి. డౌజోన్స్‌ 0.62 శాతం తగ్గింది. ఇంధన కంపెనీల షేర్ల పతనంతో డౌజోన్స్‌పై ఒత్తిడి కన్పిస్తోంది. ఇక ఐటీ, టెక్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అమెరికా మాంద్యంలోకి వెళ్ళడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ ఏకంగా 108ని దాటింది. దీని ప్రభావంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరల తగ్గింది. ఇపుడు బ్రెంట్‌ క్రూడ్‌ 99.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక శాతంపైగా నష్టాల్లో ఉన్నా… క్లోజింగ్‌కల్లా లాభాల్లోకి వచ్చేశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్ల మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని లాభాల్లో ఉండగా, కొన్ని నష్టాల్లో ఉన్నాయి. అయితే లాభనష్టాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తైవాన్‌ సూచీ ఒక్కటే 2 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇక సింగపూర్ నిఫ్టి విషయానికొస్తే…ఈ సూచీ ఇపుడు 35 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.