For Money

Business News

క్లోజింగ్‌లో భారీ దెబ్బ

నిఫ్టి మిడ్‌సెషన్‌ తరవాత కోలుకున్నట్లే కన్పించినా 2.30 గంటల తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి నిఫ్టి భారీగా క్షీణించి వంద పాయింట్లకు పడి…16031 స్థాయిని తాకింది. అయితే క్లోజింగ్‌ సమయానికి స్వల్పంగా కోలుకుని 16058 వద్ద క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 158 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టికి ప్రధాన మద్దతు 16050 పాయింట్లు. ఉదయం భారీ లాభాలతోఉన్న చాలా షేర్లు తమ లాభాలను కోల్పోయాయి. ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. లాభాలన్నీ నామ మాత్రమే. ఇక నష్టాల్లో ఐషర్‌ మోటార్స్‌ టాప్‌లో ఉంది. హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా రోజుల తరవాత జొమాటొ షేర్‌ ఇవాళ నాలుగు శాతంపైగా పెరిగింది. ఎన్‌ఎండీసీ 5 శాతం క్షీణించగా, ఆకర్షణీయ ఫలితాలు నిన్న పెరిగిన డీమార్ట్‌ ఇవాళ మూడు శాతంపైగా క్షీణించింది. ఇక మిడ్‌ క్యాప్‌ డిక్సన్‌ టాప్‌లో ఉంది. ఇక నిఫ్టి బ్యాంక్‌ షేర్లలో బంధన్ బ్యాంక్‌ ఒక్కటే రెండు శాతం లాభంతో క్లోజ్‌ కాగా, మిగిలిన 11 షేర్లు నష్టాల్లో ముగిశాయి. యూరో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నా… మన మార్కెట్లు నష్టాల్లో ముగియడం విశేషం.