For Money

Business News

SGX NIFTY డౌన్‌

రాత్రి అమెరికా మార్కెట్లు ముఖ్యంగా నాస్‌డాక్‌ భారీ నష్టాల్లో ముగిసింది. అనేక ఐటీ, టెక్‌ షేర్లలోఒత్తిడి రావడంతో నాస్‌డాక్‌ 2.26 శాతం నష్టంతో ముగిసింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.15 శాతం నష్టపోగా… డౌజోన్స్‌ అర శాతం నష్టపోయింది. డాలర్ ఇండెక్స్‌ 20 ఏళ్ళ గరిష్ఠానికి పెరిగింది. 2002 తరవాత తొలిసారి డాలర్‌ ఇండెక్స్‌ 108 డాలర్లను దాటింది. ఇక యూరో, జపాన్‌ కరెన్సీలు పాతికేళ్ళ కనిష్ఠం వద్ద ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. డాలర్‌ భారీగా పెరగడంతో క్రూడ్‌ తగ్గినా ఫలితం లేకుండా పోతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ ఏకంగా 1.79 శాతం నష్టంతో ఉంది. నిన్న భారీగా క్షీణించినందున హాంగ్‌సెంగ్‌ సూచీ నష్టాలు 0.8 శాతానికి పరిమితమైంది. తైవాన్‌ రెండు శాతం దాకా తగ్గింది. చైనా మార్కెట్లు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 110 పాయింట్ల నష్టంతోంది. సో… నిఫ్టి కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది.