స్వల్ప నష్టాల్లో నాస్డాక్
ఐటీ,టెక్ షేర్ల సూచీ నాస్డాక్ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది.ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా దాదాపు అదే స్థాయి నష్టాల్లో ఉంది. డౌజోన్స్ మాత్రం 0.26 శాతం నష్టానికే పరిమితమైంది. ఇవాళ అమెరికా జాబ్ డేటా ఆశ్చర్చపర్చింది. మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తా అధిక ఉద్యోగాల కల్పన జరిగింది జూన్. నిరుద్యోగ రేటు 50 ఏళ్ళ కనిష్టానికి చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని ఇది సంకేతాలు ఇస్తోంది.మరోవైపు ఇదే బూచి చూపి వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ ఇవాళ కూడా రెండు శాతంపైగా పెరిగాయి. డాలర్ మాత్రం స్థిరంగా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇవాళ కూడా రెండు శాతంపైగా పెరగడంతో బ్రెంట్ క్రూడ్ 107 డాలర్లకు చేరువ అయింది. బులియన్లో పెద్దగా మార్పులు లేవు.అంతక్రితం యూరో మార్కెట్ల లాభాలు చాలా వరకు తగ్గాయి.