భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి
మిడ్ సెషన్ తరవాత స్వల్ప ఒత్తిడి వచ్చినట్లు కన్పించినా… చివర్లో నిఫ్టి కోలుకుంది. 16011 గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత నిఫ్టి స్వల్పంగా తగ్గింది. కాని చివరల్లో 15986 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 179 పాయింట్ల లాభంతో ముగిసింది. క్రూడ్ ధరలు భారీగా క్షీణించడంతో మార్కెట్లో ఉదయం నుంచి ఉత్సాహపూరిత వాతావరణం కన్పించింది.యూరో మార్కెట్లు కూడా ఒకటి నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవడంతో నిఫ్టిలో అప్ ట్రెండ్ కొనసాగింది. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో లేకపోవడం ఒక్కటే కాస్త నిరుత్సాహం కల్గించే అంశం. నిఫ్టిలో 40 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి ఒక శాతం పెరగ్గా, ఇతర ప్రధాన సూచీలు దాదాపు రెండు శాతం దాదా పెరిగాయి. నిఫ్టి మిడ్ క్యాప్ రెండు శాతంపైగా లాభపడింది. విండ్‌ఫాల్ ట్యాక్స్ కారణంగా ఓఎన్జీసీ మరో 5 శాతం దాకా క్షీణించింది. కాని రిలయన్స్ మాత్రం నామమాత్రపు నష్టంతో ముగిసింది. అయితే ఇవాళ భారీ మద్దతు బజాజ్ ట్విన్స్ నుంచి వచ్చింది. ఈ షేర్లు దాదాపు అయిదు శాతం లాఃభం పొందడం విశేషం. బ్రిటానియా, హిందూస్థాన్ లీవర్ షేర్లు నాలుగు శాతం పెరిగాయి. గ్రోద్రజ్ కన్జూమర్, పేటీఎం, డిమార్ట్ షేర్లు 5 శాతంపైగా లాభపడ్డాయి. ఒక మిడ్ క్యాప్‌లో ఏయూ బ్యాంక్, ట్రెంట్, డిక్సన్, కాన్‌కర్డ్ షేర్లు నాలుగు శాతం నుంచి 5 శాతం వరకు పెరిగాయి.