15,800పైన ముగిసిన నిఫ్టి
మార్కెట్ పటిష్ఠంగా 15800పైన ముగిసింది. యూరో మార్కెట్ల లాభాలతో మన మార్కెట్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. మిడ్‌సెషన్‌లో గ్రీన్‌లోకి వచ్చిన నిఫ్టి చివరి వరకు అదే ట్రెండ్ కొనసాగింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 200 పాయింట్లు కోలుకుంది.15852ను తాకిన నిఫ్టి 83 పాయింట్ల లాభంతో 15835 వద్ద ముగిసింది. నిఫ్టి అరశాతం, నిఫ్టి మిడ్‌క్యాప్ కూడా 0.63 శాతం లాభపడగా… నిఫ్టి నెక్ట్స్ ఒక శాతం, నిఫ్టి బ్యాంక్ 1.2 శాతం లాభపడింది. నిఫ్టిలో 34 షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ నామమాత్రపు లాభంతో ముగిసింది. అయితే ఓఎన్జీసీ మాత్రం 3.74 శాతం నష్టంతో నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది. ఐటీసీ మిడ్ సెషన్ వరకు టాప్ గెయినర్‌గా ఉండగా… హిందుస్థాన్ లీవర్ ఒక్కసారి ఊపందుకుని దాదాపు నాలుగు శాతం లాభపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా టాప్ గెయినర్స్‌లో నిలిచాయి. జొమాటొతో పాటు ఇవాళ పేటీఎం కూడా ఒక మోస్తరు నష్టంతో ముగిసింది. బజాజ్ ఆటో ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఇక ఫుట్ వేర్ రంగంలోబాటా ఇండియా, మెట్రో బ్రాండ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు షేర్లు పోటీ పడుతున్నాయి.