అధిక స్థాయిలో బోల్తా
ఉదయం టెక్నికల్ అనలిస్టులు హెచ్చరించినట్లు నిఫ్టి 15900 ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. రెండు సార్లు ఆ స్థాయికి వెళ్ళి వెనక్కి వచ్చింది. ఆరంభంలోనే ఒత్తిడి ఎదుర్కొన్న నిఫ్టి వెంటనే కోలుకుని 15927ని చేరుఇంది. అక్కడి నుంచి క్రమంగా క్షీణిస్తూ 15830కి చేరింది. అంటే గరిష్ఠ స్థాయికి వంద పాయింట్లు దిగువకు చేరింది. మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో పుంజుకున్న నిఫ్టి 15900ని మళ్ళీ దాటాయి. పలుమార్లు దాటినా అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటంతో అక్కడి నుంచి చతికిలపడింది. అలాగే యూరో మార్కెట్లు కూడా లాభాల్లో కొంత కోల్పోవడంతో నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15815ను తాకింది. చివరికి క్లోజింగ్‌లో 15830 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 132 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ముగిశాయి. 12 నష్టాల్లో ముగిశాయి. ప్రధాన బ్యాంకు షేర్లు చాలా వరకు లాభాలను కోల్పోయాయి. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి నెక్ట్స్ సూచీ అర శాతం లాభంతో క్లోజ్ కాగా, నిఫ్టి మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ ఒక శాతంగా లాభపడింది. ఐటీ షేర్ల లాభాలు కూడా తగ్గాయి. క్రూడ్ ఆయిల్ పెరగంతో ఓఎన్‌జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది.