దిగువ స్థాయిలో కొనండి
15350 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని సూచించారు. నిఫ్టి గనుక 15350 దిగువకు వెళితే షార్ట్ చేయొచ్చని అన్నారు. మార్కెట్ ప్రారంభంలోనే కొనుగోలు చేయొద్దని… నిఫ్టి పడిన తరవాత కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. నిఫ్టి బ్యాంక్ కన్నా నిఫ్టిలో ట్రేడ్ చేయడం లాభదాయకమని ఆయన అన్నారు. రూ.690 స్టాప్‌లాస్‌తో ఎస్బీఐ కార్డ్స్‌ను కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఐఆర్సీటీని అమ్మాల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు.