లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. నష్టాల్లో ఉన్నా నామ మాత్రమే. రాత్రి అమెరికా డాలర్, ఈల్డ్స్ తగ్గినా.. మార్కెట్ కొద్దిసేపు మాత్రమే గ్రీన్‌లో ఉంది. తరవాత అన్ని సూచీలు నష్టాల్లో జారుకున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్ క్రూడ్ ఆయిల్ భారీగా క్షీణించింది. ఇవాళ కూడా పతనబాటలో ఉంది. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 110 దిగువకు వచ్చింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ స్వల్ప నష్టాలతో ట్రేడవుతుండగా… న్యూజిల్యాండ్, హాంగ్‌సెంగ్‌లు ఒక శాతంపైగా లాభంతో ఉంది. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… లాభాలు పరిమితమే. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి 65 పాయింట్ల లాభంతో ఉంది. ఇవాళ వీక్లీ ఆప్షన్స్‌కు చివరి రోజు.