భారీ లాభాల్లో అమెరికా సూచీలు

నిన్నటి సెలవుల తరవాత వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. ఈసారి టెక్ షేర్లతో పాటు ఎనర్జీ షేర్లు కూడా భారీ లాభాలు గడించడంతో మూడు ప్రధాన సూచీలు దాదాపు రెండు శాతం పైగా లాభపడ్డాయి. క్రూడ్ ఆయిల్ తగ్గినట్లే కన్పించినా.. వెంటనే 115 డాలర్లకు చేరింది. దీంతో డౌజోన్స్ 1.82 శాతం లాభంతో ట్రేడవుతోంది. నాస్‌డాక్ 2.75 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.36 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అంతక్రితం యూరప్ మార్కెట్లు మాత్రం ఆరంభ లాభాలను నిలపుకోలేదు. ఒకదశలో ఒక శాతం లాభంతో ఉన్న డాక్స్ చివరికి 0.2 శాతం లాభంతో ముగిసింది. ఇతర మార్కెట్లు రాణించడంతో యూరో స్టాక్స్ 50 సూచి 0.78 శాతం లాభంతో ముగిసింది. ఇక డాలర్ స్థిరంగా ఉంది…. డాలర్ ఇండెక్స్ ఇంకా 104 డాలర్లపైనే ఉంది. అలాగే బాండ్ ఈల్డ్స్ ఇవాళ కూడా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో పెద్ద మార్పుల్లేవ్.