For Money

Business News

జులై 26న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం

ప్రైవేట్‌ కంపెనీలు కూడా సొంత అవసరాల కోసం నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రైవేట్‌ కంపెనీలకు ఇలా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని టెలికాం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే టీసీఎస్‌ వంటి సంస్థలు తాము సొంత అవసరాల కోసం ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నాయి. టీసీఎస్‌ ప్రతిపాదనకు కేంద్రంఓ కే చేసింది. మరోవైపు 5జీ స్పెక్ట్రమ్‌ కోసం నోటిస్‌ ఇన్వయిటింగ్‌ అప్లికేషన్స్‌ (ఎన్‌ఐఏ)ను టెలికాం విభాగం జారీ చేసింది. జులై 26వ తేదీన వేలం నిర్వహించే అవకాశముంది.
మొత్తం 72 GHz స్పెక్ట్రమ్‌ను కేంద్రం వేలం వేయనుంది. తక్కువ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య తరహా (3300 MHz) and అధిక (26 GHz) ఫ్రీక్వెన్సీ బాండ్లలో 5జీ స్పెక్టమ్‌ను వేలం వేయనుంది. 5జీతో పోలిస్తే 5జీ స్పీడు, కెపాసిటీ 10 రెట్లు అధికం.