జంబో సీఫుడ్ రెస్టారెంట్‌కు వీడ్కోలు
హాంగ్‌కాంగ్ పర్యటనకు వెళ్ళేవారిలో చాలా మంది జంబో సీఫుడ్ రెస్టారెంట్‌కు వెళతారు. హాంగ్‌కాంగ్‌లో ఈ రెస్టారెంట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. బ్రిటన్ రాణి క్విన్ ఎలిజిబెత్ 2 నుంచి హాలివుడ్ స్టర్ టామ్ క్రూస్ వంటి మెగా సెలబ్రెటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ హోటల్ ఇపుడు హాంగ్‌కాంగ్ నుంచి అబర్దీన్ హార్బర్‌కు బయలుదేరి వెళ్ళిపోయింది. హాంగ్‌కాంగ్‌లో ఐకానిక్ హోటల్‌గా ఉన్న జంబో రెస్టారెంట్ కూడా ‘కరోనా’ దెబ్బకు విలవిల్లాడింది. హాటల్ బిజినెస్ పూర్తిగా పడిపోవడంతో…. హాంగ్‌కాంగ్ వంటి ప్రాంతంలో ఈ స్థాయి హాటల్ నిర్వహించడం కష్టమని యాజమాన్యం అంటోంది. తక్కువ ఖర్చు గల ప్రాంతంలో ఈ హోటల్ ప్రారంభిస్తామని అంటోంది. ప్రస్తుతానికైతే ఉన్న చోట నుంచి తరలించారు. తమ నగరానికి ఎంతో పేరు తెచ్చిన హోటల్ ఇలా తమ కళ్ళెదుటే వెళ్ళిపోవడం నగరవాసులను ఎంతగానే బాధించింది. హోటల్‌కు వీడ్కోలు చెప్పడానికి వేల మంది తరలి వచ్చారు. ఈ హోటల్ నిర్వహణకు ప్రభుత్వం సాయం చేయాలని, దీన్ని కాపాడాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఓ ప్రైవేట్ సంస్థ కోసం ప్రజాధనం వెచ్చించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.