నిఫ్టి… పెరిగితే అమ్మడమే
అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. మన మార్కెట్ల విషయానికొస్తే.. మార్కెట్‌ను ఉత్సాహపరిచే వార్తల్లేవ్. పెద్ద ప్రతికూల అంశం. దూసుకుపోతున్న క్రూడ్ ధరలు.తాజా సమాచారం ప్రకారం ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.5 డాలర్లకు చేరుతోంది. సమీప కాలంలో 75 డాలర్లకు, మధ్యకాలీన 85 డాలర్లకు చేరుతుందని అనలిస్టులు అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఒత్తిడి వచ్చే అవకాశముంది.
నిఫ్టి క్రితం ముగింపు …15740
ఇవాళ నిఫ్టికి 15730 కీలక స్థాయి
15,685 ప్రాంతానికి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఈ స్థాయికి దిగివకు వస్తే తదుపరి మద్దతు స్థాయి 1567. ఈ స్థాయిలో కోల్పోతే అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎందుకంటే 15,660 మార్కెట్‌కు చాలా కీలక స్థాయి.
ఈ స్థాయిల్లో నిఫ్టి ఎక్కడ మద్దతు లభించినా 157,000 వద్ద తొలి ప్రతిఘటన వస్తుంది. దీన్ని దాటితే 15733, 15783 స్థాయిలకు చేరుతుంది.
కాబట్టి దిగువస్థాయిలో 15,670 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి.
15,780 ప్రాంతానికి వస్తే 15,800 స్టాప్‌లాస్‌తో అమ్మండి.
మార్కెట్ ట్రెండ్ బుల్లిష్‌గా ఉంది. అయితే నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది.
