For Money

Business News

ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లు లబోదిబో…

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ సమయంలో షేర్లు కొనుగోలు చేసిన యాంకర్‌ ఇన్వెస్టర్లు ఇవాళ షేర్లను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ కౌంటర్‌లో ఇప్పటికే 50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఉదయం ఈ షేర్‌ రూ.700 దిగుకు వచ్చింది. ఓపెనింగ్‌లో రూ. 690.90 వద్ద ప్రారంభమైన ఈ షేర్‌లో ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 670ని తాకింది. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ఇన్వెస్టర్లు 30 శాతం దాకా నష్టపోయినట్లు. ఈ స్థాయి నష్టాలతో కూడా యాంకర్‌ ఇన్వెస్టర్లు షేర్లను అమ్మడం మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ షేర్‌కు రూ. 700 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. ఇపుడు షేర్‌ రూ.670.50ని తాకింది. మరి ఇక్కడి నుంచి కోలుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే నిఫ్టి చాలా భారీ నష్టాలతో ట్రేడవుతోంది. ఇవాళ కోలుకుంటుందా అన్న అనుమానం మార్కెట్‌ వ్యక్తమౌతోంది. నిఫ్టి నష్టాల్లో కొనసాగే పక్షంలో… ఎల్‌ఐసీ షేర్‌ కూడా నష్టాల్లో కొనసాగే అవకాశాలే అధికంగా కన్పిస్తున్నాయి.