భారీ నష్టాల్లో నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 15816కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 370 పాయింట్ల నష్టంతో 15827 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 1325 పాయింట్లు నష్టపోయింది. నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే… బ్లూచిప్ షేర్లలో కూడా కొనుగోలుదారులు కరువు అవుతున్నారు. హెచ్డీఎఫ్సీ గత శుక్రవారం 4 శాతం క్షీణించగా,ఇవాళ కూడా మరో 4శాతం పైగా క్షీణించాయి. దాదాపు అన్ని సూచీలు 2 శాం నుంచి రెండున్నర శాతం క్షీణించగా, నిఫ్టి బ్యాంక్ ఏకంగా మూడు శాతం నష్టపోయింది. నిఫ్టి 46 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కొన్ని ఫార్మా షేర్లు నామమాత్రపు లాభాల్లో గ్రీన్‌లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ 4 శాతం నష్టంతో టాప్ లూజర్స్‌గా నిలిచింది. 3.85 శాతం నష్టంతో కొటక్ బ్యాంక్ ట్రేడవుతోంది. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు నిఫ్టి టాప్ లూజర్స్‌లో ముందున్నాయి. నిఫ్టి నెక్ట్స్లోని 50 షేర్లలో కేవలం రెండు షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో ఉన్నాయి. నిఫ్టి మిడ్ క్యాప్‌లోని 25 షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ నాలుగు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్ డార్లింగ్‌గా ఉన్న అశోక్ లేల్యాండ్ 3.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది.