రూ. 15,000 వరకు లావాదేవీలకు ఓటీపీ అక్కర్లేదు
క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల ఆధారంగా జరిపే లావాదేవీలకు లేదా ప్రి పెయిడ్ లావాదేవీలకు ఈ మాండేట్ (అంటే కస్టమర్ ఆమోదం తప్పనిసరిగా కావాలి)కు పరిమితి ఇప్పటి వరకు రూ. 5000 ఉంది.అంటే రూ. 5000 దాటిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లావాదేవీకి కార్డ్ హోల్డర్ కచ్చితంగా ఓటీపీ ద్వారా ధృవీకరించడం తప్పనిసరి. లావాదేవీ జరిగిన వెంటనే కస్టమర్‌కు వచ్చే ఓటీపీతో లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంది. ఇక నుంచి ఈ పరిమితిని రూ. 15000లకు పెంచారు. అంటే రూ. 15000 లోపు లావాదేవీలకు ఈ మాండేట్ అక్కర్లేదు. అంటే ఓటీపీతో ధృవీకరించాల్సిన పనిలేదు. రూ. 15,000 దాటిన లాదవాదేవీలకు మాత్రం ఓటీపీ ధృవీకరించాల్సి ఉంటుంది.
యూపీఐ లింక్
ఇక నుంచి అన్ని క్రెడిట్ కార్డులను యూపీఓ లింక్ చేసేందుకు అనుమతించాలని ఆర్బీఐ ఆదేశించింది. యూపీఐ వినియోగం పెంచేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాత దాస్ అన్నారు. ముందుగా రూపే క్రెడిట్ కార్డులతో దీన్ని ప్రారంభిస్తారు. అంటే రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారన్నమాట.