For Money

Business News

మెట్రో పొలిస్‌పై అదానీ కన్ను

మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత శరవేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్‌ ఇపుడు వైద్య రంగంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు దేశంలోనే ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన అపోలోతో జతకట్టనుంది. డ‌యాగ్నస్టిక్ నెట్‌వ‌ర్క్‌ రంగంలో ఉన్న మెట్రో పొలిస్ హెల్త్‌కేర్‌లో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు అపోలో హాస్పిట‌ల్స్‌తో అదానీ హెల్త్ వెంచ‌ర్స్ (ఏహెచ్‌వీఎల్‌) జాయింట్‌ వెంచర్‌ నెలకొల్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ మార్కెట్ క్యాపిటలైజేష‌న్ క‌నీసం రూ.7,765 కోట్లు (ఒక బిలియ‌న్ డాల‌ర్లు) ఉంటుంద‌ని అంచనా. హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించనున్నట్లు గ‌త నెల‌లో ప్రక‌టించిన అదానీ గ్రూప్‌ అపుడే భారీ టేకోవర్‌ రంగం సిద్ధం చేసింది. హాస్పిట‌ల్స్, డ‌యాగ్నస్టిక్ నెట్‌వ‌ర్క్‌ల‌ను టేకోవ‌ర్ చేసుకోనుంద‌ని వార్త‌లొచ్చాయి. 19 రాష్ట్రాల్లో విస్తరించిన మెట్రోపొలిస్ హెల్త్‌కేర్‌ వివిధ రకాల డ‌యాగ్నస్టిక్ సేవ‌లను అందిస్తోంది.